
మెంతులతో తయారుచేసిన అట్లు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరముగా ఉంటాయి. మెంతులు రాత్రిపూట నానబోసి ఉదయాన్నే వాటిని సరిపడా ఉప్పు, కారము, జీలకర్ర వేసి మెత్తగా రుబ్బాలి. ఈ పిండి జిగురుదనంగా ఉంటుంది. ఈ పిండిని పెసరట్టు వేసినట్లు నేతితో కాలుస్తారు. అట్లు కొంచెం చిరుచేదుగా ఉంటాయి. అయినా రుచికరంగా ఉంటాయి.

మెంతి అట్లలో ఆరోగ్య రహస్యాలు
- మెంతులతో తయారుచేసిన ఈ అట్లు రుచిగా ఉంటాయి.
- అరుచి, అతిసారము పోగొడతాయి.
- ఆకలి పుట్టిస్తాయి.
- ఛర్ది కడుతుంది.
- మలబంధము చేయును.
- కఫము కరిగించి దగ్గు తగ్గిస్తుంది.
- రక్తమాంసములుపెంచి బలము, పుష్టి, వీర్యవృద్ధి, సంభోగశక్తి కలిగిస్తాయి.
- ఎన్నేళ్ళు వచ్చినా కొందరు బాలికలు క ృశించినట్లు కనపడతారు. వారికి దేహధారుఢ్యము కలిగిస్తాయి.
- రజస్వల ఆలస్యమైన ఆడపిల్లలకు ప్రతీరోజు రెండేసి మెంతి అట్లు ఉదయము పెడుతూ ఉన్నట్లయితే చాలా మేలు కలుగుతుంది.
- స్త్రీలకు ఋతురక్తము తగువిధంగా జారీచేసి శరీరానికి పుష్టి, కాంతి, లావణ్యము కలిగిస్తుంది.
- ఋతుశూల కల స్త్రీలకు ఈ మెంతి అట్లు ఎంతో మేలు చేస్తాయి.
