నేల ఉసిరితో చర్మ వ్యాధులు మాయం

ఫిల్లాంథస్ అమారస్ షుమన్ అండ్ థాన్ అనే శాస్త్రీయనామం కలిగిన నేల ఉసిరి యుఫర్బియేసి కుటుంబానికి చెందినది. ఈ నేల ఉసిరి మొక్క ఇంచుమించు 70 సెంటీమీటర్ల ఎత్తు వరకూ పెరిగే ఏకవార్షిక మొక్క. దీని శాఖలు పత్రాల వలె కనిపిస్తాయి. పత్రాలు చిన్నవిగా, దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. పుష్పాలు చిన్నవిగా ఉండి లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. స్త్రీ, పురుష పుష్పాలు ప్రత్యేకంగా కణుపుల నుండి ఏర్పడతాయి. ఫలాలు గుండ్రంగా ఉండి ఆరు విత్తనాలను కలిగి ఉంటాయి. నల్లగా ఉంటాయి. 

ఈ మొక్కను పుష్పాలు, ఫలాలు సంవత్సరం పొడవునా లభిస్తాయి. ఈ మొక్క పంట పొలాల్లోను, బీడు భూముల్లోనూ , తేమ ఉన్న ప్రదేశాల్లోనూ కలుపు మొక్కగా పెరుగుతుంది. 

ఔషధ గుణాలు

సమూలంగా ఈ మొక్కను వైద్యపరంగా ఉపయోగిస్తారు. ఈ మొక్కలో ఫిల్లాంథిన్, హైపొఫిల్లాంధిన్, నిరాంధిన్ వంటి అనేక రసాయన పదార్ధాలుంటాయి. 

నేల ఉసిరి కషాయాన్ని కామెర్ల వ్యాధి నివారణలో వాడతారు. లేత కొమ్మలు జిగట విరేచనాలను అరికడతాయి. చర్మవ్యాధులు, అజీర్ణం, అతిమూత్రవ్యాధి, గనేరియా, స్త్రీ ఋతుసంబంధ వ్యాధులు, శరీర ఉబ్బులను తగ్గిస్తుంది. ఈ మొక్కను కొద్ది ఉప్పుతో నూరి చర్మంపై పూస్తే దురదలు, చర్మవ్యాధులు నివారణ అవుతాయి. దగ్గు, అల్సర్, వాపులు తగ్గుతాయి. 

నేల ఉసిరి మొక్క విత్తనాల పొడిని లోనికి తీసుకుంటే స్త్రీల ఋతు సమయంలో జరిగే అధిక రక్తస్రావాన్ని ఆవుతుంది. 

ఆయుర్వేద మందులు

చ్యవనప్రాశ, అమృతప్రసాఘృతం, చెంపారుత్యాది తైలం, మధుయాస్ట్యాది తైలం వంటి ఆయుర్వేద మందులలో ఈ మొక్కను వినియోగిస్తారు. 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.