About us

ప్రతి మనిషి  ప్రకృతి ఒడిలో సేదతీరు తున్నాడు. జీవరాశులన్నీ ప్రకృతి నీడలోనే మనుగడ సాగిస్తున్నాయి.  ప్రకృతి మనకు అపారమైన సంపద ఇచ్చింది. వాటిలో పచ్చని చెట్లు ప్రధానమైనవి... వాటిలోని వేలాది ఔషధాలు మన మనుగడకు  కీలకమైనవి. భావితరాలకు బతుకునిచ్చేవి. వీటిని పరిరక్షించుకోవాలనే హిందూ సంప్రదాయాలలో ఒక అంతర్భాగం  అయిన ఆయుర్వేదాన్ని ప్రచార౦ చేయడ౦లో భాగ౦గా దేశంలో లభించే వనములికల వివరాలు వాటి వినియోగాలను తెలుగులో వివరిస్తూ దేశీయంగా లభించే సుమారు 2500కు పైగా వనములికల వివరాలతో  ourherbs.in అనే ఈ వెబ్సైటును అభివృద్ధి పరుస్తున్నాము. 

Our Herbs Kitchen

మన౦ వినియోగి౦చే అన్ని కూరగాయలు, ఆకు కూరలు కూడా వనమూలికలే. అందులో ఔషధాలకు పనిచేసే కూరగాయలు కూడా చాలా ఉన్నాయి.  ఆరోగ్య పరిరక్షణ కోసం మన౦ తినాల్సిన ఆకు కూరలలో ఎన్నో పోషకాలు, విటమిన్లు, మినరల్స్ ఉన్నాయి. వాటన్నిటినీ వినియోగి౦చి అనారోగ్యకరమైన మసాలాలను వాడకు౦డా కేవల౦ స౦ప్రదాయ పద్దతిలో ఆరోగ్యకమైన, రుచికరమైన వ౦టకాలను మీక౦ది౦చే౦దుకు Our Herbs Kitchen YouTube Channel కూడా నిర్వహిస్తున్నాము. ఈ బ్లాగును ఆదరి౦చడ౦తో పాటు, మా యూట్యూబ్ ఛానల్ ను కూడా SUBSCRIBE చేసుకుని మమల్ని ఆదరిస్తారని ఆకా౦క్షిస్తున్నాము. 

హిందూ ధర్మప్రచారం

పండుగలు వాటి పరమార్ధాలు, సంప్రదాయ సిద్ధంగా పూజలు, నోములు, వ్రతాలు ఎలా చేసుకోవాలి వంటి వాటిపై అవగాహన కల్పిస్తూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను నేటి తరానికి గుర్తు చేయడంతో పాటు ప్రజల్లో భక్తిభావాలను రేకెత్తించే కార్యక్రమాలను మేము డిజిటల్ మాధ్యమం ద్వారా నిర్వర్తిస్తున్నాము. మేము Bhakti Saram పేరుతో  బ్లాగు నిర్వహిస్తున్నాము. 
మమ్ములను మా ఈమెయిల్ చిరునామాలలో సంప్రదించవచ్చు : suryamdevalla@gmail.com, laklshmidnbs@gmail.com

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.