వాతపైత్యములను పోగొట్దేది కమ్మరేగు( Atrocarpus Lakoocha)

లకుచ లికుచ అని సంస్కృతంలో పిలిచే కమ్మరేగు వృక్ష జాతిలోనిది. ఈ చెట్టును ఆంగ్లములో Atrocarpus Lakoocha అని పిలుస్తారు. ఆకు జువ్వి ఆకులాగా ఉంటుంది. కాయలు గుండ్రముగా పోక కాయలు లాగా నుండును. గింజ తెల్లగా ఉండును. 

కమ్మరేగు గుణములు

  • కమ్మరేగు పచ్చికాయల పులుపు రుచి కలిగి ఉంటుంది.
  • వేడిచేస్తుంది. 
  • గురుత్వము కలది. 
  • మలబద్ధమును చేస్తుంది.
  •  మూడుదోషములను కలిగిస్తుంది. 
  • రక్తమును ప్రకోపింపచేస్తుంది. 
  • వీర్యమును, జఠరాగ్నిని నశింపచేస్తుంది.
  •  కళ్ళకు మిక్కిలి అహితమైనది. 
  • కమ్మరేగు పళ్ళు తియ్యగాను, కొంచెం పుల్లగాను ఉంటాయి. 
  • వాత పైత్యములను హరిస్తుంది. 
  • కఫమును చేస్తుంది. 
  • జఠరదీప్తిని కలిగిస్తుంది.
  • రుచిని పుట్టిస్తుంది. 
  • వీర్యవృద్ధిని చేస్తుంది.
  • మలబద్ధమును కలిగిస్తుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.