హస్తితుండీ అని సంస్కృతంలో పిలిచే ఏనుగుతుండపు చెట్టును ఇంగ్లీషులో Indian Turn Sole Plant అని పిలుస్తారు. ఇది అన్ని ప్రాంతాల్లోను కనిపిస్తుంది. ఈ చెట్టు కొమ్మలు ఏనుగు తొండములాగా వంగి ఉంటాయి. చిన్న చిన్న పువ్వులు కూడా ఉంటాయి. ఈ మొక్కను అనేక రకాల విషములను హరించడానికి వినియోగిస్తారు అని వస్తుగుణప్రకాశిక గ్రంథంలో వివరింపబడి ఉంది.
Indian Turn Sole Plant గుణములు
- ఈ ఏనుగుతుండపు చెట్టు కారపు రుచి కలిగి ఉంటుంది.
- సన్నిపాత జ్వరములను హరిస్తుంది.
- జంతువిషములను హరిస్తుంది.
Indian Turn Sole Plant ఔషధాలు
ఏనుగుతుండపు చెట్టు ఆకుల రసమును నువ్వులనూనెతో కలిపి మాగా మరగకాచి ఆ పాకమును తేలు కుట్టినచోట పూసినట్లయితే విషము హరిస్తుంది. వాపులు తగ్గడానికి, ముఖ్యంగా పిచ్చికుక్క కరిచినపుడు ఆ విషాన్ని హరించడానికి ఇది పనికివస్తుంది.