చక్రవర్తీకూరను సంస్కృతములో వాస్తుక, శాకరాటీ అని పిలుస్తారు. ఇంగ్లీషులో Chenopodium Album అంటారు. ఈ ఆకుకూర తీపి రుచి కలిగి ఉంటుంది. ఉష్ణవీర్యము, సరగుణము కలిగి ఉంటుంది. విపాకమున కారపు రుచి.
చక్రవర్తీకూర ఉపయోగాలు
త్రిదోషహరమైనది. దీపన పాచనములను కలిగిస్తుంది. బుద్ధిబలము, బలము, పుష్టి ఇస్తుంది. క్రిములు, మూలశంకలు, ప్లీహములు హరిస్తుంది. పిత్తరక్తశామకమైనది. మలబద్ధమును పోగొడుతుంది. నేత్రములకు హితకరమైనది. పథ్యకరమైనశాకము. మలమూత్ర శుద్ధిని చేస్తుంది.