గంగరావిచెట్టు : మేహవ్రణములకు మంచి ఔషధం గంగరావి చెట్టు


గంగరావిచెట్టు వృక్షజాతికి చెందినది. దీనిని సంస్కృతములో బ్రహ్మదారు, తూదీ అని పిలుస్తారు. ఆంగ్లములో Morus Indica మరియు Hibiscus Populneus. ఇంచుమించుగా దీని ఆకులు రావిఆకులను పోలి ఉండును. పువ్వులు ఎరుపు, పసుపు రంగులుగా ఉంటాయి. పువ్వు మృదువుగా, కోలగా ఉంటాయి. పిందెలు పచ్చని పాలు కలిగి ఉంటాయి. కాయలు కుదిమట్టముగా ఉంటాయి.

గంగరావి చెట్టు గుణములు

గంగరావి చెట్టు కషాయ మధుర రసములు కలది. ఉష్ణవీర్యము. స్నిగ్ధ గుణము. విపాకమున మధురరసముగా మారుతుంది. దీనితో సూరేకారము, పంచలవణములు కట్టును. దీనితో కట్టిన సూరేకారము శగలకు మంచిది. మేహములకు మేహములను, కుష్ఠురోగములను హరిస్తుంది. చెక్క కషాయముతో వ్రణములు కడిగితే అవి మానుపడతాయి. మేహవ్రణములు మానుతాయి.

గంగరావి చెట్టు ఔషధములు

గంగరావి చెట్టు ఆకులు విస్తరిగా కుట్టి తలకు కట్టిన శిరోవాతములు హరించును. ఆకు మెత్తగా దంచి ఆముదమున వెచ్చచేసి పైన కట్టినా లేక కాచినా వాతనొప్పులు హరిస్తాయి. రసపట్లు తగ్గుతాయి. ఆకులు రసముతో రసగంధకములు నూరి పుండ్లకు రాసినట్లయితే దుర్వాసన కలిగిన పుండ్లు కూడా మానుతాయని వస్తుగుణప్రకాశికలో వివరింపబడింది. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.