గుమ్మపాలు అంటే అప్పుడే పితికిన పాలు. అంటే Milk Just Drawn అన్నమాట. గుమ్మపాలను సంస్కృతంలో ధారోష్ణాలు అంటారు. అప్పుడే పితికిన పాలు చల్లారకుండానే ఉన్న గుమ్మపాలు మంచి ఔషధ గుణం కలిగి ఉంటాయి. వీటిని లోనికి పుచ్చుకున్నట్లయితే చాలా ప్రయోజనాలు ఉంటాయి.
గుమ్మపాలలో ఔషధ గుణాలు
- మేహశాంతి, బలమును కలిగిస్తాయి.
- వీర్యవృద్ధి, దేహపుష్టిని ఇస్తాయి.
- శరీరానికి రక్తము పడుతుంది.
- ధాతుశోష తగ్గుతుంది.
- అగ్నిదీప్తినిస్తుంది.
- గుమ్మపాలలో మిరియాల పొడి కలిగి త్రాగించినట్లయితే విషజ్వరాలు సైతం తగ్గుముఖం పడతాయని వస్తుగుణప్రకాశిక అనే ఆయుర్వేద గ్రంథంలో వివరించబడింది.