బియ్యము ఉడకబెట్టి వార్చిన నీటినే గంజి అంటారు. దీనినే ఇంగ్లీషులో Boiled Rice Soaked in Conjee అంటారు. ఈ గంజిని వేడిగాను, చల్లగాను కూడా తాగుతారు. పొలంపనులు చేసేవారు సాధారణంగా చల్లగా ఉన్న గంజినే తాగుతారు.
గంజి గుణములు
మధుర కషాయ రసములు కలిగినది. శీతవీర్యము. మధుర విపాకము కలది. మేహశాంతిని చేస్తుంది. ఎండ దెబ్బ వలన కలిగిన ఆయాసమును పోగొడుతుంది. దప్పిని అణచి తృప్తిని కలిగిస్తుంది. మూత్రమును జారీచేస్తుంది. కాంతి, వీర్యము, బలమును కలిగించును. బియ్యమును సగం ఉడుకుచుండగా తీసిన నీటిని చిట్టుడుకు నీరు అంటారు. ఇది పథ్యకరమైనది. బలహీనులకు, చంటిపిల్లలకు, నీరసపడిన రోగులకు హితకరమైనది. గంజిలో విటమిన్ B, ఐరన్, జింక్, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి.జ్వరం, కలరా వంటి వ్యాధుల నుండి ఉపశమనం: గంజి డీహైడ్రేషన్ మరియు అతిసారం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.