కన్నెకోమలి అని తెలుగులో పిలిచే ఈ మొక్క Nyctaginaceae కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయనామం Commicarpus chinensis. ఈ మొక్కను ఆయుర్వేద వైద్యులు విరివిగా వినియోగిస్తుంటారు. మొక్కజాతిలోనిది. మూర ఎత్తు వరకూ పెరుగుతుంది. దీనికి మూడు దళముల ఆకులు ఉంటాయి. గరప నేలలో ఇది ఎక్కువగా పెరుగుతుంది. దీనిలో తీగజాతి కూడా ఉందని తెలుస్తోంది.
కన్నెకోమలి గుణములు
దుంప చేదు, వగరు రుచులు కలిగి ఉంటుంది. వేడి చేస్తుంది. విపాకమున కారపురుచిగా మారుతుంది. స్నిగ్ధగుణము కలిగిని. మూడు దోషములను హరిస్తుంది. తాపమును హరిస్తుంది. వీర్య నష్టమును అరికడుతుంది. ఈ కన్నెకోమలి దుంప రసమును మేకపాలలో కలిపి ఉదయము సేవించినట్లయితే శుక్ల నష్టములు అరికడుతుంది. ఇలా వారంరోజుల పాటు సేవించాలి. కన్నెకోమలి ఆకు రసమును కొబ్బరినూనెతో కలిపి రాసినట్లయితే కాలిపుండ్లు మానుతాయి.