కఫరి - ఖర్పర, రసక అనే పేర్లు కలిగిన కఫరి అనేది ఖనిజ ద్రవ్యములలో ఒక విధమైన వస్తువు. దీనిని ఇంగ్లీషులో A Sort of Vitriol, Binjack.L. Zinci Sulpidum అని పిలుస్తారు. ఈ లోహము విషయంలో వివిధ రకాల అభిప్రాయాలున్నాయి. ఒక అభిప్రాయం ప్రకారం ఇది కార వేళ్ళక, దర్దుర అని రెండు రకాలుగా ఉంటుంది. మరో అభిప్రాయం ప్రకారం కఫరి, గుడకఫరి, పాషాణకఫరి అని మూడు రకాలు అని చెప్పబడి ఉంది. ఈ ఖనిజములలో పొరలు కలిగిన దానిని దర్దుర అని, పొరలు లేనిని కారవేళ్ళ అని పిలుస్తారు. పసుపుపచ్చ రంగు కలిగినది మృత్తి కఫరి. బెల్లము వలే ఉండేది గుడ కఫరి, రాయి వలె ఉండేది పాషాణ కఫరి. ఔషధాలలో దర్దురము, కారవేళ్ళకమును వినియోగిస్తారు. మృత్తికా కఫరి వాదవిద్యలో వినియోగిస్తారు. కఫరిని ముక్కలుగా కొట్టినట్లయితే ఒక విధమైన కాంతిగల పొరలు ఉంటాయి. కొబ్బరిముక్కలను పోలి ఉంటాయి. ఇట్టి లక్షణాలు కలిగి ఉన్న ఖనిజము శ్రేష్ఠమైనది. దర్దురములో సత్వము కలదు. కారవేళ్ళములో సత్వములేదు. కావున దర్దురమును సత్వపాతమునకు ఉపయోగించాలి.
కఫరి గుణములు
- కఫరి కఫమును, పైత్యమును శమింపచేస్తుంది.
- నేత్రరోగములో చాలా హితమైనది.
- మేహవ్యాధులను, జీర్ణజ్వరములను, క్షయవ్యాధిని హరిస్తుంది.
- ఇది భస్మముచేసి వాడినచో సర్వరోగములు నివారింపబడతాయి.
- అశుద్ధమైన కఫరిని వినియోగిస్తే వాంతి, భ్రమ, శోష మొదలైన దుర్గుణములను పుట్టిస్తుంది.
- ఫరి శుద్ధి చేయాలంటే చేదు ఆనబతో చురకా ఇచ్చినట్లయితే శుద్ధమైనది అవుతుంది.
కఫరి ప్రయోజనములు
- కఫరి భస్మము రెండు గురివిందగింజల ఎత్తు, కాంతభస్మము రెండు గురివిందగింజల ఎత్తు కలిపి త్రిఫల కషాయముతో సేవించినట్లయితే మేహములు, పాండురోగము హరిస్తుందని వస్తుగుణప్రకాశిక గ్రంథంలో వివరింపబడి ఉంది.
- రక్తహీనత కూడా ఈ కషాయము సేవించడం వల్ల తగ్గుతుంది.
- కఫరి భస్మము, తిలక్షారపునీరు(నువ్వులనీరు) రాత్రి ఒక పాత్రలో పోసి ఉదయాన్నే సేవించినట్లయితే మధుమేహము తగ్గుముఖం పడుతుంది. యోనిశూలలు, ఉబ్బులు తగ్గుతాయి.