గాలివానచెట్టుతో పలు చర్మరోగాలు మాయం

ఈ చెట్టును గాలివాన చెట్టు అని ఎందుకు పిలుస్తారంటే కొన్నేళ్ళక్రితం గాలివానకు విత్తనము భూమిమీద పడి దేశమంతటా వ్యాపించింది. అప్పటినుంచీ ఈ చెట్టుకు ఆ పేరు సార్ధకమైంది. ఈ చెట్టును డాగ్ మిర్చి అని, వైల్డ్ మిర్చి అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు ఆఫోర్బేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయనామం Crotan Bona Plandinam. ఈ మొక్క మన ఇంటి చుట్టుపక్కల కనిపిస్తూనే ఉంటుంది. అందరికీ తెలిసిన మొక్కే ఇది. సుమారు రెండు అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఆకు కోలగా ఉంటుంది. అడవి తులసి ఆకులను పోలి ఉంటుంది. ఆకులకు చుట్టూ సూక్ష్మమైన కంగోరా ఉంటుంద. ప్రతీ కొమ్మ సన్నని వెన్నులు కలిగి ఉంటుంది. వెన్ను నిండా చిన్న పూసల వంటి మొగ్గలు, దాని నుండి సూక్ష్మ కేసరములు, చిన్న చిన్న తెల్లటి పువ్వులు ఉంటాయి. కాండము నార కలిగి గట్టిగా ఉంటుంది. కాండమునకు నూగు ఉంటుంది. కాయకు మూడు కోణాలు ఉంటాయి. కాయలో మూడు లేక నాలుగు విత్తనాలు ఉంటాయి. మిక్కిలి చిన్న కాయలు ఉంటాయి.

గాలివాన చెట్టు గుణములు

కారము, చేదు కలిగిన రుచి కలిగి ఉంటాయి. ఆకు నమిలినట్లయితే కొంచెం చిమచిమలాడుతుంది. ఉష్ణవీర్యము, విపాకమున కారపు రుచి కలిగి ఉంటుంది. లఘుతీక్ష్ణగుణములు కలిగి ఉంటుంది. సమస్త చర్మరోగములను హరిస్తుంది. పిల్లల యకృత్ ప్లీహాభివృద్ధులకు మంచిగా పనిచేస్తుంది. జీర్ణకారి, విరేచనము చేస్తుంది. దగ్గులను బోచేస్తుంది. శ్లేష్మహరము, వాత, పైత్యములను చేస్తుంది. గింజలు విరేచనము చేస్తాయి. 

గాలివాన చెట్టు ఔషధములు

చిడుము, గజ్జి, తామర:

గాలివానచెట్టు ఆకులను నిమ్మరసముతో కలిపి నూరి రాసినట్లయితే తామర అనే చర్మరోగము తగ్గుతుంది.  ఆకు రసమును పసుపుతో కలిపి రాసినట్లయితే చిడుము, గజ్జి , గాలివానచెట్టు ఆకు రసమును ఆముదముతో కలిపి ఉడికించి కట్టుకట్టినట్లయితే వాత నొప్పులు హరిస్తాయి. 

తలనొప్పులకు

గాలివానచెట్టు ఆకులు తలకు కట్టినట్లయితే తలనొప్పులు ఉపశమిస్తాయి.

పార్శ్వశూలలకు

గాలివానచెట్టు ఆకు, బెల్లము, చిన్న అల్లంముక్కలను చితక్కొట్టి ఆ రసము సస్యము చేయించినట్లయితే పార్శ్వశూలలు తగ్గతాయి. తులసి లేక గగ్గెఱ జాతులలో ఈ మొక్క చేరి ఉంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.