బాదం చెట్టు జిగురునే కతీరాగోదు అని పిలుస్తారు. ఇది యునానీద్రవ్యము. ఇది తెల్లరంగులో ఉంటుంది.
కతీరాగోదు గుణములు
రుచి చేదుగా ఉంటుంది. మేహశాంతి చేస్తుంది. చలువచేస్తుంది. విపాకమున కారపురుచిగా మారుతుంది. మిక్కిలి వీర్యవృద్ధిని చేస్తుంది. రక్తమును శుభ్రపరుస్తుంది. గాయములను మాన్పుతుంది. గురుత్వము గలది అగుటచే జీర్ణముకాక కడుపులో నొప్పిని పుట్టిస్తుంది. దీన్ని నేరుగా కాకుండా ఇతర పదార్ధములలో కలిపి వినియోగిస్తారు.