ఊషాపానము: ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే చల్లని మంచినీరు తాగటాన్నే ఊషాపానము అంటారు. ఇలా మంచినీటిని తాగటం శరీరానికి ఎంతో ఆరోగ్యాన్నిస్తుంది. ప్రతిదినమూ ఇలా ఉదయాన్నే మంచినీరు సేవించడం వల్ల త్రిదోషాలు శాంతి పొందుతాయి. దీర్ఘాయుర్దాయము కలుగుతుందని ఆయుర్వేదం వివరిస్తోంది.
మూలశంక, ఉబ్బులు, గ్రహణి, జ్వరములు, అగ్నిమాంద్యము, ముసలితనము, కుష్ఠు, కొవ్వు, క్రొవ్వు, మూత్రాఘాతము, పిత్తము, చెవులలో కలిగే బాధలు, కంఠరోగములు, శిరోరోగములు, కటిశూల, నేత్రవ్యాధులు, పోతాయి. ముఖ్యముగా మలబంధము తగ్గిపోతుంది. స్థౌల్యరోగము కలిగిన వారికి ఈ ఊషాపానము గొప్ప చికిత్స అని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. ఈ ఉపాయాన్ని ఒక నెల పాటు ప్రతిరోజూ ప్రయత్నిస్తే, మీ చర్మ ఆరోగ్యం మెరుగుపడటం మరియు మొటిమలు మరియు పొడి చర్మం గతానికి గుర్తుగా మారడం కూడా మీరు చూస్తారు.