పచ్చలు: గరుత్మత, మరకత అని సంస్కృతంలో పిలువబడే పచ్చలు భూగర్భంలో అక్కడక్కడా లభిస్తాయి. పచ్చలను ఇంగ్లీషులో Emeralds అని పిలుస్తారు. భూగర్భంలో లభించిన పచ్చల ముడిపదార్ధాన్ని సానబట్టి అలంకార వస్తువులుగా తయారుచేసి ఉపయోగిస్తారు.
పచ్చలు గుణములు
పచ్చలు నవరత్నచింతామణిలో ఒకటి. పచ్చలు ఆకుపచ్చరంగులో ఉండి తళుకులీనుతూ ఉంటాయి. బరువుగాను, నునుపుగాను, కాంతి కల పచ్చలు శ్రేష్టమైనవి. ఈ పచ్చలు ఆభరణముగా ధరిస్తే శరీరమునకు ఆరోగ్యకరము. ఎక్కడ ఉంటే అక్కడ జయం చేకూరుతుంది. లక్ష్మీప్రదమైనది. శ్రీకృష్ణుడు వక్షస్థలములో ధరించాడు. దీనినిబట్టి ఈ పచ్చల శ్రేష్ఠత చెప్పనక్కరలేదు.
పచ్చలతో ఔషధములు
పచ్చల శుద్ధి
పచ్చను నేలగుమ్మి దుంప మధ్యలో ఉంచి శీలఇచ్చి పుఠము వేసినట్లయితే పచ్చ శుద్ధి అవుతుంది.
పచ్చల భస్మము
వాకుడు కాయల రసముతో భావన చేసి తెలగపిండి వేళ్ళతో నూరి పుఠము వేసినట్లయితే పచ్చభస్మం అవుతుంది.