అల్లపుగడ్డి: ఆర్ద్రక ఘాస అని సంస్కృతంలో పిలువబడే అల్లపుగడ్డి గడ్డిజాతిలోకి చెందిన మొక్క. దీనినిఇంగ్లీషులో Ginger Grass అని పిలుస్తారు. ఇది కారపు రుచి కలిగి ఉంటుంది. అల్లపువాసన వస్తుంది. వేడిచేస్తుంది. విపాకమున కారపు రుచిగా ఉంటుంది.
అల్లపుగడ్డి నుండి తైలము తీస్తారు. ఈ చమురు వాత నొప్పులను అన్నింటిని హరిస్తుంది.దీని కషాయము లోనికి ఇచ్చినా, పైన పూతగా పూసినా కూడా నొప్పులు తగ్గుతాయి. నరములకు బలమును ఇస్తుంది. జ్వరమును తగ్గిస్తుంది.