అజకర్ణకము, సర్జకము అని సంస్కృతంలో పిలువబడే అరిపూస అనేది పెద్ద వృక్షజాతికి చెందినది. ఎప్పుడూ పచ్చగా ఉంటుంది. దీని ఆకులు మేక చెవులవలె ఉంటాయి. దీని శాస్త్రీయనామం Vateria Indica. ఈ చెట్టు గింజలు చితక్కొట్టి నీటిలో వేసి ఆముదం తయారుచేసినట్లు మరగకాచినట్లయితే చిక్కని చమురు వస్తుంది. ఆ నూనెను పైకి తీసినవెంటనే గడ్డకడుతుంది. ఇది రంగు పచ్చని పసుపు కలిపిన రంగులో ఉంటుంది. దీన్నే అరిపూస అంటారు.
అరిపూస ఉపయోగములు
అరిపూస మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. దీనితో రకరకాల వార్నీషులు తయారుచేస్తారు. నూనెతో కలిపి పట్లు కూడా తయారుచేస్తారు.
అరిపూస గుణములు
కటుతిక్త కషాయములు కలిగినది. ఉష్ణవీర్యము అంటే వేడిచేయునది. కఫవ్యాధులు, పాండువులు, కర్ణరోగములు, ప్రమేహములు, కుష్ఠు, విషదోషములు, వ్రణములు హరిస్తుంది. ఆమవాతము(కీళ్ళనొప్పులు) తగ్గిస్తుంది.