చిట్టుడుకు నీళ్ళతో పలు ఉపయోగాలు

బియ్యం సగం ఉడికినప్పుడు తీసిన నీళ్ళకే చిట్టుడుకు నీళ్ళు అని పేరు. ఇప్పుడయితే అందరూ కుక్కర్లు వాడుతున్నాం కానీ ఇదివరలో అందరూ అన్నం కుంపట్లు, పొయ్యిలపై ఇత్తడి గిన్నెలు, కంచు గిన్నెలలో వండేవారు. అలా వండినప్పుడు బియ్యం ఉడుకుతూ ఉన్నప్పుడు ఆ నీటిని తీసి దానిలో నిమ్మరసం, ఉప్పు కలిపి సేవిస్తే ఎంతో రుచికరంగాను, ఆరోగ్యం కరంగాను ఉంటాయి. ఇలా తీసిన నీటినే చిట్టుడుకునీరు అంటారు. 

చిట్టుడుకు నీరు ఉపయోగాలు

  • ఈ చిట్టుడుకు నీరు తేలికగా జీర్ణమవుతాయి. 
  • ప్రయాణాలు చేసేవారు మార్గాయాసం తీర్చుకోవాలంటే ఈ చిట్టుడుకు నీరు దివ్య ఔషధం. బడలిక తీరుతుంది.
  • జ్వరాలు తదితర జబ్బుల సమయంలో వచ్చే బలహీనతను పోగొట్టాలంటే చిట్టుడుకు నీరు సేవిస్తే చాలా మంచిది. 
  • శోష, దప్పి తగ్గించడానికి ఇది హితకారిగా ఉంటుంది. 
  • ఇది శరీరానికి వేడి చేయకుండా, మరీ చలువచేయకుండా సరైన ధాతువుగా పనిచేస్తుంది. 
  • శరీరానికి తృప్తిని కలిగించి మూత్రమును ఫ్రీగా జారీ అయ్యేలా చేస్తుంది. 
  • ముఖ్యంగా వేసవిలో ఇది చాలా మంచి ఆహారం. వేసవి తాపాన్ని తగ్గించి, వడదెబ్బను పోగొట్టాలంటే ఈ చిట్టుడుకు నీళ్ళు సేవించాల్సిందే. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.