ఇనుపగోలు గింజలు సర్వరోగనివారిణి

ఈషద్గోల అని సంస్కృతంలో పిలువబడే  ఇనుపగోలు గింజలు సర్వరోగనివారిణిగా పనిచేస్తాయి. దీనినే ఇంగ్లీషులో Plantago Isapagula, Spogel Seeds పిలుస్తారు. ఈ గింజలు ముఖ్యంగా యునానీ సంప్రదాయంలో వైద్యంలో వినియోగిస్తారు. తెలుగు వైద్యులు కూడా ఉపయోగిస్తారు. 

ఇనుపగోలు గింజల గుణములు

  • ఈ గింజలు వగరు తీపి కలిసిన రుచిగా ఉంటాయి. చలువచేస్తాయి. విపాకమున తీపి రుచిగా మారతాయి. జిగురుగా ఉంటాయి. 
  • రక్తపైత్యమును, రక్తాతిసారమును, కఫపైత్యములను అణుస్తాయి. వాతము చేసే స్వభావం కలిగి ఉంటాయి. మంచి వీర్యవృద్ధిని కలిగిస్తాయి. 
  • శెగ రోగములలో కలిగే మంటను తగ్గిస్తాయి. ఈ కషాయములో తాటి కలకండతో కలిపి ఇచ్చినట్లయితే మూత్రము సాఫీగా జారీ అవుతుంది. 
  • ఉమ్మెత్త రసములో ఇనుపగోలు గింజలు ఉడికించి వ్రణములను కట్టినట్లయితే సెలలు వేసి కుళ్ళిన వ్రణములు(కురుపులు) కూడా మానిపోతాయి. 
  • గర్భకోశములోని వ్రణములు కూడా హరిస్తాయి. 
  • ఇనుపగోలు మొక్క ఆకు కషాయము గాని, గింజల కషాయముగాని లోనికి పుచ్చుకున్నట్లయితే క్షయజ్వరములు, రోజువిడిచి రోజూ వచ్చే జ్వరములు హరిస్తాయని వస్తుగుణప్రకాశిక గ్రంథములో వివరింపబడింది. 
  • సర్వ విషయములకు దీని వేరు గంథము రాసి గుడ్డపొగ వేసినట్లయితే శమిస్తాయి. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.