కంటక పంచమూలము
కంటకపంచమూలము అంటే వాకుడు వేరు, పల్లేరు వేరు, జటామాంసి, ములుగోరింట వేరు, పిల్లితేగలు వీటన్నింటి కలిపి తయారుచేసిన ఔషధము. వీటన్నింటితో కషాయం తయారు చేసి సేవించినట్లయితే రక్తపిత్తము, ఉబ్బు, పాండువు, కామెల, ప్రమేహములు, శుక్రదోషములు హరిస్తాయి.
కంటకారీత్రయము
కంటకారీత్రయము అంటే వాకుడు, ములక, పెద్దదూలగొండి మూడు కలిపి తయారుచేసిన కషాయము. ఈ కంటకారీత్రయము అనే ఔషధాన్ని సేవించినట్లయితే త్రిదోషములు హరిస్తాయి. భ్రమ, పిత్తము, తంద్ర, ప్రలాపము, జ్వరములకు మంచి మందుగా పనిచేస్తుంది.