అంతరతామర ను సంస్కృతంలో కుంభికా అని, ఆంగ్లములో Pistia Stratiotes, Cassytha Filifomis అని పిలుస్తారు. ఇది నీటిలో అలముకునే ఒక రకమైన నాచుమొక్క. తేమనీరుగల గుంటలలోను, చెరువులలోను విస్తారంగా ఉంటుంది. ఆకుల భేదమును బట్టి ఇది రెండు విధములుగా ఉంటుంది. ఆకులు తామర ఆకుల్లాగా గుండ్రంగా ఉంటాయి. వేళ్ళు నూలు దారాల్లా సన్నగా ఉంటాయి. ఆకుయొక్క రంగు పసుపు. ఆకుపచ్చ కలిసిన రంగులో ఉంటుంది. ఆకులు దంచి రసము తీసినట్లయితే ఎర్రగా ఉంటుంది. పువ్వులుండవు. పెద్దాకులు గల గల తామరకు రెండడుగుల నిడివి గల కాడ ఉంటుంది. ఈ రసము పచ్చగాను, చిరు చేదుగాను ఉంటుంది.
చిన్నరకపు అంతరతామర ముద్దలోొ మైలతుత్తము పెట్టిపుటము వేసిన తెల్గా తెల్లగా భస్మమగును. తాళకము కూడా ఇటులే లఘుపుటము వేసిన ఎరుపురంగులో భస్మమగును. పలు విధములైన ధాతువులన్నియు దీనితో భస్మమగును. పంచలవణములను దీని రసముతో నూరి దీని ముద్దలొో పెట్టి గజపుటము వేసినట్లయితే భస్మం అవుతుంది. ఈ ఔషధము అతి దారుణమైన ఉబ్బురోగములను హరిస్తుంది. అయితే ఈ మందు వాడుతున్నప్పుడు చప్పిడి పత్యం చేయాలి. అతి మేహ కారకములవలన శరీరములో పుట్టిన మంటకు అంతరతామర ఆకులు కట్టినట్లయితే శమిస్తుంది. దీని ఆకులు మాడ్చి నీళ్ళలో ఇగరే వరకూ కాచి ఆ క్షారాన్ని వివిధ ఆయుర్వేద మందుల్లో ఉపయోగిస్తారు.