ఎనిమిది రకాల పదార్ధాలను కలిపి చేసిన చూర్ణమునే అష్టచూర్ణము అంటారు. శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, అజామోదము, సైంధవలవణము, తెల్లజీలకర్ర, నల్లజీలకర్ర, పొంగించిన ఇంగువ అన్నింటినీ కలిపి కొట్టిన చూర్ణమునే అష్టచూర్ణము అంటారు.
అష్టచూర్ణము గుణములు
- అష్టచూర్ణము రుచికరంగా ఉంటుంది.
- వేడిచేసే స్వభావము ఉంటుంది.
- అజీర్ణమును నివారిస్తుంది.
- వాతగుల్మములను, వాతశూలలను పోగొడుతుంది.
- ఋతుశూలలను తగ్గిస్తుంది.
- తెల్లకుసుమలను హరిస్తుంది.
- కారప్పొడి లాగే అన్నంలో వేసుకుని తింటే కడుపులోని మందము, శూలలు, నులిపురుగులు తగ్గుతాయి.