అష్టగుణమండము ఇలా తయారుచేయాలి
అష్టగుణమండము తయారీకి ఒక గ్లాసు వేయించిన పెసరపప్పు, రెండు గ్లాసులు బియ్యం, ఎనిమిది గ్లాసులు నీళ్ళు పోసి ఉడకబెట్టాలి. తరువాత దానిలో ఇంగువ, సైంధవ లవణము, ధనియాలు, శొంఠి, మిరియాలు, పిప్పళ్ళు అన్నీ కొద్దికొద్దిగా కలిపి చూర్ణము చేసి కలపాలి. ఆ కలిపిన మిశ్రమాన్ని వడకట్టి సేవించాలి. ఇలాంటి సూప్ తాగితే ఆకలిపుట్టడంతో పాటు బలము వృద్ధిచేస్తుంది. వస్తి శోధనము చేస్తుంది.