క్షీరి, రాజాదన అనే పేర్లు కలిగిన పాలచెట్టు దృఢమైన వృక్ష జాతికి చెందినది. మన్యపు అడవులలో ఎక్కువగా పెరుగుతుంది. ఈ పాలచెట్టు శాస్త్రీయనామం Mimu Spos Indica Mimusops Hexandrn. ఈ చెట్టంతా పాలుంటాయి. ఆకులు తెంపితే పాలు చిమ్ముతాయి. కాయలు కూడా జిగురు కలిగిన పాలు కలిగి ఉంటాయి. శాఖములకు కణుపులు కలిగిన చిన్న రెమ్మలు ఉంటాయి. దీని కర్రను చేతికర్రలకు ఉపయోగిస్తారు. పళ్ళు ఈత పళ్ళలాగా ఉంటాయి. పండు రంగు పచ్చగా ఉంటుంది. ఇది మందులకు మిక్కిలి ఉపయోగకరమైనది. ఆకు కొంచెం కోలగా పగడచెట్టు ఆకులలాగా ఉంటాయి. దీని గింజలలో చమురు ఉంటుంది.
క్షీరవృక్ష
ఈ పాలచెట్టు పాలు గల వృక్షము. తెల్లని పాలు కలిగినది. గుత్తులు గుత్తులు గా పళ్ళు ఉంటాయి. తియ్యని పళ్ళు కలిగిన చెట్టు. వేప గింజల లాంటి గింజలు ఉంటాయి. దిట్టమైన మ్రాను కలిగి ఉంటుంది.
పాలచెట్టు గుణములు
పాలచెట్టు ఇది తీపి రుచి కలిగి ఉంటుంది. మధురవిపాకము. ఆమ్ల విపాకము కలిగినదని ఋషులు తెలియచేసారు. స్నిగ్ధ, గురు గుణములు కలిగినది. చలువచేసే స్వభావము కలిగి ఉంటుంది. రుచిని పుట్టిస్తుంది. వాతహరమైనది. పైత్యమును, మేహములను హరిస్తుంది. తృప్తి కలిగిస్తుంది. వీర్యవృద్ధిని చేస్తుంది. శరీరమును పెంచుతుంది. గుండెకు హితకరమైనది.
పాలచెట్టు పళ్ళు
- తీపి, వగరు కలిగిన రుచిగా ఉంటుంది. గురుగుణము.
- పైత్య ప్రదరములకు
- పాలచెట్టు ఆకు నేతితో వేయించి తిన్నట్లయితే పైత్య ప్రదరములు హరిస్తాయి.
- మొటిమలకు
- ఆకులు మెత్తగా నూరి నలుగు పెట్టినట్లయితే మొటిమలు నిర్మూలించబడతాయిని చరకసంహిత గ్రంథం తెలియచేస్తోంది.