పారేవత అనే పేరు కూడా కలిగిన ఈడెపళ్ళను A Sort of Orange అని పిలుస్తారు. వీటిని వాడుక భాషలో ఈటిపళ్ళు అని కూడా అంటారు. దీనిలో పుల్ల ఈడెపళ్ళు, తీపి ఈడెపళ్ళు అనే రెండు రకాలు ఉంటాయి. కమలాఫలము జాతిలోకి చేరుతుంది. పువ్వలు తెల్లగా ఉంటాయి. పండు నిమ్మపండంత చిన్నగా ఉంటుంది. లోపల ఏడెనిమిది తొనలు ఉంటాయి.
ఈడెపండు గుణములు
- ఈడెపళ్ళు తీపి, పులుపు కలిసిన రుచి కలిగి ఉంటుంది.
- వేడిచేసే స్వభావముతో ఉంటుంది.
- శీతస్పర్శము కలది.
- విపాకమున తీపి రుచిగా మారుతుంది.
- వీర్యపుష్టి కలిగిస్తుంది.
- మేహశాంతిని చేస్తుంది.
- వాత పిత్తమును అణుస్తుంది.
- దప్పిని తగ్గిస్తుంది.
- శ్లేష్మమును కలిగిస్తుంది.
- శరీరమునకు బలమునిస్తుంది.