పావర : మహేంద్రవారుణి (చేదుపుచ్చ) తో శ్లేష్మవాతములకు చెక్

మహేంద్రవారుణి అని సంస్కృతములో పేరు కలిగిన పావర మొక్క పాదులుగా పాకుతుంది. ఈ పావరనే ఆంగ్లములో Citrulls Colocynthis, Cacunis Colocynthis అని పిలుస్తారు. ఈ మహేంద్రవారుణి లో మూడు రకములు ఉన్నాయి. చాలామంది చేదు పుచ్చ అని, పాపరబుడమ అని సాధారణభాషలో పిలుచుకుంటారు. దీని ఆకులు పెద్దవిగా ఉంటాయి. 

పావర పాదు గుణములు 

ఈ పావర పాదు సమూలముగా ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ఈ చేదుపుచ్చను చూర్ణముగాను, తైలము గాను, పలాస్త్రీగాను(పట్టీ), కషాయముగాను వాడవచ్చును. ఈ పావర కాయ గింజలలో చమురు ఉంటుంది. కాయల రసములో పంచదార కలిపి తింటే ఉబ్బులు తగ్గుతాయి. వేరు చంటిపిల్లలకు ఆంత్రవాతమున ఏర్పడిన శ్వాసకాసలకు బాగా పనిచేస్తుంది. గింజల తైలము పాముకాటు, తేలుకాటుకు విరుగుడుగా పనిచేస్తుంది. తలవెంట్రుకలను పెరిగేలా చేసి, నల్లబరుస్తుంది. వేరు చూర్ణము మూత్రవ్యాధులలోను, మేహ వాతములలోను పనిచేస్తుంది. సస్యముగా ఉపయోగిస్తే కంటిరోగములకు, నాసారోగములను హరిస్తుంది. నులిపురుగులకు, జ్వరములకు కూడా మంచిది. చేదు పుచ్చకాయ రసమును ఆముదములో వేసి కాచిన తైలము, మలబద్దము, శ్లేష్మవ్యాధులు, ఆంత్రవ్యాధులు, ఉబ్బురోగములకు కూడా పనిచేస్తుంది. 

పావర పాదు ఔషధములు

చేదుపుచ్చ లేక పాపర పది గ్రాముల కాయ రసములో పది గ్రాముల ఆముదము కలిపి త్రికటుకలు మూడు గ్రాములు, కరక్కాయ పొడి ఒక గ్రాము, జీలకర్రపొడి ఒక గ్రాము కలిపి తైలము మిగిలేలా కాచాలి. పూటకు పెద్దలకు మూడు చుక్కలు, పిల్లలకు ఒక చుక్క చనుబాలతో ఇవ్వాలి. పెద్దలకు అయితే ఆవుపాలతో ఇవ్వాలి. దీనివలన శ్లేష్మవాతములను హరించి చక్కగా విరేచనము చేస్తుంది. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.