అడవి అరటిని సంస్కృతంలో వనకదళి, శిలారంభ, దారుకదళి, వనమోద, ఆశ్మకదళి అని, ఇంగ్లీషులో Wild Plantain అని పిలుస్తారు. ఈ అడవి అరటి పండు చాలా రుచిగా ఉంటుంది.
అడవి అరటి గుణములు
గురుత్వము కలిగి ఉంటుంది. చలువ చేస్తుంది. ఆకలి మందగింపచేస్తుంది. దప్పిక, తాపము, మూత్రకృచ్ఛ్రము, విస్ఫోటము, అస్థిరోగము పోగొడుతుంది. బలము, పుష్టి కలిగిస్తుంది. తృప్తినిస్తుంది. వృష్యము.