అడవి అల్లమును సంస్కృతంలో వనాద్ద్రకము అంటారు. ఇంగ్లీషులో Wild Ginger అని పిలుస్తారు. కారపు, పులుపు కలగలిసిన రుచితో ఉంటుంది.
అడవి అల్లం గుణములు
రుచి పుట్టిస్తుంది. అడవి అల్లం ఆకలి వృద్ధిచేస్తుంది. పైత్యము, కఫము హరిస్తుంది. బలము, పుష్టి చేస్తుంది. మలబంధము పోగొడుతుంది. దీనినే వాడుక భాషలో కారు అల్లము అని పిలుస్తారు.