నిష్పాన అని సంస్కృతంలో పిలువబడే అనుములను Dolichos Loblod and Dolichos Sinensis Seeds అని ఆంగ్లములో పిలుస్తారు. ఈ అనుములు రెండు బద్దలుగా విడుతాయి. మెట్ట ప్రాంతాల్లో పండుతుంది. కాయ కొంచెం మదమువాసన కలిగి ఉంటుంది. ఆకు చిక్కుడు ఆకును పోలి ఉంటుంది. రెండు గజముల వరకూ తీగ పాకుతుంది.
అనుములు గుణములు
- తీపి, వగరు కలిగిన రుచి కలిగి ఉంటుంది. విపాకమున పులుపు రుచిగా మారుతుంది.
- రూక్ష గుణము కలవి అగుటచే అనుములు ఉడకపెట్టి తినినట్లయితే కొంచెం కడుపు ఉబ్బి, అపాన వాయువులను విస్తారము ధ్వనితో వెడలించును.
- మలమును, మూత్రమును కూడా సాఫీగా జారీచేయును.
- చనుబాలను వృద్ధిచేస్తాయి.
- విషము, వాపులు, శ్లేష్మమును హరిస్తుంది.
- గుండెను పాడుచేసి శుక్రమును నశింపచేయును.
- ఈ అనుములు ఆషాఢమాసములో మునగ ఆకుతో కలిపి వండుకుని తింటారు. దీనివలన లోపల ఉండే కొన్ని రకాల విషములు హరిస్తాయి.