అల్లి చెట్టు : Memecylon Tinetorium అనే శాస్త్రీయ నామాన్ని కలిగిన అల్లి చెట్టు అడవులలో పెరుగుతుంది. నడిపి ాజతిలోనిది. గుజ్జుగా, పొగడచెట్టు వలె ఉంటుంది. పువ్వులు నీలంరంగులో కలిగి జాజి పువ్వుల వలె సువాసన కలిగి ఉంటాయి. పండ్లు నలుపు.
అల్లి చెట్టు గుణము
- అల్లి పళ్ళు తీపి, వగరు కలిసి రుచికలిగి ఉంటాయి.
- అల్లి పళ్ళు తింటే నాలుక నీలిరంగు రాసినట్లు అవుతుంది. కుంకుడు గింజంత పండు ఉంటుంది.
- అల్లి చెట్టు శ్రావణ, భాద్రపద మాసములలో ఎక్కువగా పూస్తుంది.
- అల్లిచెట్టు వేరు, ఆకు కూడా వగరుగా ఉంటుంది. పైత్యము చేస్తుంది.
- అల్లిచెట్టు తెల్ల కుసుమలకు దీని కషాయము శ్రేష్ఠమైనది.
- అల్లి చెట్టు అన్ని రకాల విరేచనములను కడుతుంది.
- నేత్ర రోగములను హరిస్తుంది. అల్లి చెట్టు ఆకులు పన్నీరుతో నూరి నాలుగు చుక్కలు కంటిలో వేస్తూ ఉంటే పొరలు, పుసి కట్టుట మొదలగు కంటి వ్యాధులు హరిస్తాయి. కషాయముతో కన్నులు కడుగుతూ ఉంటే కలకలు నివారించబడును.