ఆకలి పుట్టించే పేరింట చెట్టు


సంస్కృతములో నాడికము అని పిలువబడే పేరింట చెట్టును ఇంగ్లీషులో Corohorus Capsularis, Trilocularis అని పిలుస్తారు. ఇది భారతదేశంలోని అన్ని ప్రాంతాలలోను, శ్రీలంక ప్రాంతంలోను కనిపిస్తుంది. తూర్పు బంగ్లాదేశ్ ప్రాంతంలో కూడా ఉంటుంది.

ఈ పేరింట చెట్టు ఆకులు, గింజలు ఔషధాలుగా ఉపయోగిస్తారు. 

పేరింటచెట్టు గుణములు

  • పేరింట ఆకుల కషాయము అగ్నిమాంద్యమును పోగొడుతుంది. 
  • జ్వరములు వచ్చినప్పుడు కషాయముగా కూడా వినియోగిస్తారు. మూత్రకృచ్ఛ్రము, సెగరోగము కూడా పోగొడుతుంది. 
  • చిన్నపిల్లలకు సంభవించే క్రిమివ్యాధులు, జలుబు పోగొడుతుంది. 
  • ఆకుల రసముతో కలరా వ్యాధితో ఆకలి మందగించిన వారికి ఆకలి పుట్టిస్తుంది.
  •  బలము, పుష్టి కలిగిస్తుంది. 
  • ఎండుటాకులను వలితము అని పిలుస్తారు.  గ్రహణి రోగము తీవ్రముగా ఉన్నప్పుడు పేరింట ఎండుటాకుల చూర్ణము, పసుపు సమపాళ్ళలో కలిపి రోజూ అరచెంచా వంతున క్రమంగా సేవిస్తూ ఉంటే క్రమంగా తగ్గుముఖం పడుతుందని వస్తుగుణప్రకాశిక గ్రంథంలో పేర్కొనబడింది. 
  • పేరింట ఆకులు, ధనియాలు, సోంపు సమానంగా కలిపి కషాయం కాచి ఇచ్చినట్లయితే శూలలు (అల్సర్ వ్యాధి) అదుపులోకి వస్తుంది. 
  • పేరింట గింజల పొడిని అరచెంచా వంతున వాడినట్లయితే జ్వరములు తగ్గుతాయి. 
  • శిరోరోగములు, కుష్ఠు తగ్గించడంలో ఉపకరిస్తుంది.
  •  నాలుకకు రుచి పుట్టించే గుణం ఈ పేరింటలో ఉంది. 
  • పేరింట పిత్తమును తగ్గిస్తుంది. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.