ఎర్రమునగ- Horseradish తో బహు ప్రయోజనాలు

పెద్ద వృక్ష జాతికి చెందిన ఎర్రమునగచెట్టు శాస్త్రీయనామం Red Horseradish Tree. ఈ చెట్టు ఆకులు కూడా మునగ ఆకులవలె ఉంటాయి. అయితే ఆకులు చెట్టునిండా దట్టంగాను, విస్తారంగాను ఉంటాయి. పువ్వులు కూడా ఎక్కువగానే పూస్తాయి. పూవులలోని కేసరములు మాత్రమే సువాసన కలిగి ఉంటాయి. దీనిని పశువులు, ఇతర మృగములు తినవు.

గుణములు

  • తీపి, కారము కలిసిన రుచిగా ఉంటాయి. 
  • తీక్షగుణము కలిగి ఉంటుంది. 
  • మిక్కిలి వేడిస్తుంది. 
  • విపాకమున కారపు రుచిగా మారుతుంది.
  •  మిక్కలి వీర్యవంతమైన మహా ఔషధము. 
  • రసాయన వస్తువు. ఉబ్బులు, కడుపుబ్బరములు, వాతరోగములు, పిత్త, శ్లేష్మములను గూడా తగ్గిస్తుంది.
  • పక్వమునకు రాని సెగ్గడ్డలకు ఈ కూరను వండుకుని తిన్నా, కషాయంగా తాగినా, పైన వేసి కట్టుకట్టినా కురుపులు హరిస్తాయి. 
  • ఆకు కూరను వండుకుని తింటే జఠరదీప్తి కలిగిస్తుంది. విరేచనము చేస్తుంది. 
  • గింజలు విషమును హరిస్తాయి. 
  • మిగిలిన గుణములు సాధారణ మునగతో సమానంగానే ఉంటాయి. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.