ఎలుక విష హరము మూషకపర్ణి

మూషకపర్ణి అని సంస్కృతంలో పిలువబడే తీగజాతిలోని మొక్కకు శాస్త్రీయనామము Ipomoea Remiformis .  నేలమీద పాకే తీగజాతిలోని ఈ తీగను తెలుగులో ఎలుకచెవితీగ అని పిలుస్తారు. ఈ తీగ ఆకులు ఎలుక చెవిని పోలి ఉంటాయి. 

మూషకపర్ణి గుణములు 

  • మూషకపర్ణి తీగ లఘుగుణము గలది. 
  • రసాయన ద్రవ్యము. 
  • కఫపైత్యములను శమింపచేస్తుంది. 
  • శూలలు, జ్వరములు, క్రిములు, గ్రంధులు, మూత్రకృచ్ఛములు, ప్రమేహములు హరిస్తుంది. 
  • హృద్రోహములను, పాండురోగములను, భగంధరములను, కుష్టువులను పోగొడుతుంది. 
  • విషములు పోగొడుతుంది.
  •  యోని దోషములను హరిస్తుంది. 
  • ఈమూషకపర్ణి తో పాదరసము గడ్డకడుతుంది. 
  • నేత్రరోగములను అరికడుతుంది. 
  • ఈ మూషకపర్ణి ఆకును కూరగా వండుకుని తింటారు. అంతేకాకుండా ఈ ఆకు ఎలుక విషములకు విరుగుడుగా పనిచేస్తుంది. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.