ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. ముఖ్యంగా చిగురు ఉన్న ఆకుకూరలు చాలా మంచివి. ముఖ్యంగా చింతచిగురు కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఆకులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
చింతచిగురు తినడం వల్ల నోటిపూత తగ్గుతుంది. రక్తశుద్ధికోసం, చిన్నపిల్లల జీర్ణక్రియ మెరుగుపరచడం కోసం మాత్రమే కాకుండా ఎముకల పటుత్వం కోసం కూడా ఈ చింతచిగురు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇటువంటి ఎన్నో పోషక విలువలున్న చింతచిగురుతో నువ్వులు కలిపి మసాలాలు ఏమీవేయకుండా, టేస్టీగాపచ్చడి చేసే విధానాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం.