ఫైబర్ పుష్కలంగా ఉండే పనసపొట్టు షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం. ఈవిధంగా పనసపొట్టును 12 వారాలపాటు కొంతమంది బ్లడ్ షుగర్ ఉన్నవారికి తినిపించి చూడగా షుగర్ దానంతట అదే అదుపులోకి వచ్చినట్లు నిరూపణ అయింది. అంతేకాకుండా ఈ కూరలో వాడే జీడిపప్పులో కూడా అధిక ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్ ఉన్నాయి.
దీనితోపాటు ఈ కూరలో వాడిన మెంతిపొడి కూడా షుగర్ వ్యాధి నియంత్రణకు ఎంతోఉపకరిస్తుంది. ఇలాంటి ఆరోగ్యకరమైన కాంబినేషన్ లో పనసపొట్టు కూరను ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం.