రోగాలు వచ్చిన తర్వాత హాస్పటల్ కు వెళ్ళడం కన్నా మనం రోగాలబారిన పడకుండా ముందే జాగ్రత్త పడడం చాలా అవసరం కదా. అందుకే మనం నిత్యం తీసుకునే ఆహారం విషయంలో కూడా అంతే జాగ్రత్తగా వ్యవహరించాలి.
ఆరోగ్యకరమైన వంటలను చేసుకుని తినాలి. పుదీనా అంటే తెలియని వారుండరు. ఈపుదీనాను పచ్చడిగాను, గ్రీన్ టీలలోకి వాడుతూ ఉంటారు.
పుదీనా ఆకు అంటే తెలియనివారుండరు. దీనినే మింట్ లీవ్స్ అని కూడా అంటారు. ఈ పుదీనా ఆకు ముఖ్యంగా జీర్ణక్రియ సంబంధిత సమస్యలకు దివ్యమైన ఔషధం. ఇందులో సోడియం, పొటాషియం, కార్బొహైడ్రేట్లు, ఫైబర్, ప్రొటీన్లు చాలా ఉంటాయి. శరీరానికి విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. కాల్ఫియం, మెగ్నీషియం, విటమిన్ బి6, మాంగనీస్, ఫోలేట్ కూడా పుదీనాలో దండిగా లభిస్తాయి.
ఇంతటి ఆరోగ్యకరమైన పుదీనాతో పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం రండి.