కిస్ మిస్ పండు: క్షుద్రద్రాక్ష అని సంస్కృతంలోను, Vitis Vinfera అని ఇంగ్లీషులోను పిలువబడే కిస్ మిస్ పండు ద్రాక్ష జాతిలోనిది. కిస్ మిస్ పండు తీగలు, ఆకులు, గుత్తులు ద్రాక్షను పోలి ఉంటాయి. అయితే ఆకులు, పళ్ళు చిన్నవిగా ఉంటాయి. కిస్ మిస్ పళ్ళలో గింజలు ఉండవు.
కిస్ మిస్ గుణములు
తీపిరుచి కలిగి ఉంటాయి. శీతవీర్యము, విపాకమున మధుర రసముగ మారుతుంది. ఉష్ణ గుణము కలిగినది. ద్రాక్ష కంటె పథ్యకారి. మూలవ్యాధిని హరించడంలో చక్కగా పనిచేస్తుంది. మేహ వ్యాధులు తగ్గిస్తుంది. దగ్గులు శమింపచేస్తుంది. బలమును కలిగించి వీర్యవృద్ధి చేస్తుంది.