చిలకడదుంపలతో వీర్యవృద్ధి

 

రక్తాళుః, పిండకంద అని సంస్కృతంలోను, Dioscorea Aculeata, Whiteor Country Patato అని ఇంగ్లీషులోను పిలువబడే చిలకడదుంపలో తెలుపు, ఎరుపు రంగుల జాతులు ఉన్నాయి. దుంపలు కొన్ని కోలగాను, కొన్ని గుండ్రముగాను ముల్లంగి దుంపలను పోలి ఉంటాయి. మోహనదుంపలు అని, మాదీఫలపు దుంపలు అని కూడా వాడుకలో వ్యవహరిస్తారు. వీటికి విత్తనములు లేవు. తీగలనే ముక్కలుగా చేసి నాటుతారు. 

చిలకడదుంప తీగ రెండు నుంచి మూడు బారుల దూరము వరకూ పాకుతుంది. ఆకులు మూడు కోణములు కలిగి గుండ్రముగా ఉంటాయి. తెల్ల దుంప కాసే జాతి కాడ తెల్లగాను, ఎర్రదుంపల తీగ కాడ ఎర్రగాను ఉంటుంది. చిలకడదుంప ఆకులు గ్రామ్ ఫోన్ గొట్టమువలె ఉంటాయి. 

చిలకడదుంపలు ఇసుక భూముల్లో విస్తారంగా పండుతాయి. దుంపలకు, కాడకు కూడా తెల్లని పాలు ఉంటాయి. తీగను పశువులు తింటాయి. దుంపలను మాత్రమే మనం ఆహారంగా వినియోగిస్తాం. 

చిలకడదుంప గుణములు

చిలకడదుంప రుచికి తీయగా ఉంటుంది. చలువ చేస్తుంది. విపాకమున కూడా తీపి రుచితోనే ఉంటుంది. కఫమును కలిగిస్తుంది. వీర్యవృద్ధి చేస్తుంది. రుచికరముగా ఉంటుంది. మూత్ర సంబంధ వ్యాధులను పోగొడుతుంది. తేలికగా జీర్ణముకాదు. ఎక్కువగా తినకూడదు. అరుగుదల నెమ్మదిగా జరుగుతుంది. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.