కర్బుర, ఆమ్రార్దక అని సంస్కృతంలోను Mango Ginger అని ఇంగ్లీషులోను పిలువబడే మామిడల్లము మొక్క ఆకులు, దుంప కూడా ఇంచుమించు అల్లమునే పోలి ఉంటుంది. దుంప కూడా అచ్చం అల్లంలాగే కనిపిస్తుంది. ఈ దుంప మామిడికాయల వాసన కలిగి ఉంటుంది. కావున దీనికి మామిడల్లమని పేరు. ఈ దుంపను పచ్చడి చేస్తారు.నిమ్మకాయ రసంతో కలిపి బద్దలుగా చేస్తారు.
మామిడల్లం గుణములు
ఇది కారపు రుచి కలది. రుచిప్రదమైనది. అరోచకమును పోగొడుతుంది. ఆమమును పెంచుతుంది. పైత్యకారి. వాతమును హరిస్తుంది. పచ్చి మామిడల్ల ముక్కను నములుతూ ఉంటే దంతములలో వచ్చిన నొప్పి తగ్గుతుంది. మామిడల్లం రసమును లోనికి తీసుకుంటే శ్లేష్మం వల్ల వచ్చిన ఆయాసం తగ్గుతుందని వస్తుగుణ ప్రకాశిక అనే ఆయుర్వేదగ్రంథం తెలియచేస్తోంది.