ప్రసారణి-సుప్రసార అని సంస్కృతంలోను, Paederia Foetida అని ఆంగ్లములోను పిలువబడే గొంతెమగోరు మొక్క భూమిమీద రెండుమూడు గజముల దూరం వరకూ సవరము వలె గుజ్జుగా పాకుతుంది. సీతాదేవి నూలుపోగులు అనే పేరు కూడా ఈ మొక్కకు కలదు. ఆకులు వెలుతురు చెట్టు ఆకుల వలె ఉంటాయి. చిన్నతెల్లని పువ్వులు పూస్తుంది. గోరింట కాయల వంటి కాయలు కాస్తుంది.
గొంతెమగోరు గుణములు
చిరుచేదు, ఉష్ణవీర్యము. కటువిపాకము, గురుగుణము కలిగినది. విరేచనకారి. మూలవ్యాధి, రేచీకటి, వాత కఫములను హరిస్తుంది. వాతరక్తరోగమును శమింపచేస్తుంది. వాపులను తగ్గిస్తుంది. శుక్రవృద్ధి, బలకరము. విరిగిన ఎముకలు అతుకుటకు వినియోగిస్తారు. దదీనితో ప్రసారిణీ తైలము తయారుచేస్తారు. సమస్త వాతములను హరిస్తుంది. ఈ గొంతెమగోరుతో తామ్రభస్మము అవుతుంది. ఇది శూలలకు పెట్టింది పేరు.