వనాఢ్య అని సంస్కృతంలోను, Wild citron అని ఆంగ్లములోను పిలువబడే అడవి మాదీఫలము చలువచేసే గుణము కలిగి ఉంటుంది. విపాకమున కూడా పులుపు రుచియే కలిగి ఉంటుంది.
అడవి మాదీఫలముతో ఔషధాలు
- నాలుక మొదలుకుని ఆమాశయము వరకూ ఉండు ప్రదేశాన్నంతటినీ శోధిస్తుంది.
- అరుచిని పోగొట్టి అగ్నిదీప్తి ఇస్తుంది.
- మాదీఫలము రసములో సైంధవలవణము కలిపి నాలుగు చుక్కలు ముక్కులో వేసి పీల్చినట్లయితే సన్నిపాత జ్వరములోని మాంద్యము, కళ్ళు తెరవలేని మాంద్యము నశిస్తుంది.
- జిగట విరోచనములు, మూలశంకలు నశిస్తాయి.
- వాతము తగ్గిస్తుంది.
- మాదీఫలము లోపలి తొనలలోని రసము గుల్మములను, శూలలను హరిస్తుంది.
- గింజలు సంతానప్రాప్తి కలిగించుటకు వినియోగిస్తారు.
- శ్వాసకాసలు హరిస్తుంది.