లఘుకశాతకీ, సప్తపుత్రి అని సంస్కృతంలో పిలువబడే గుత్తిబీర బీరలలో ఒకజాతి. ఆకులు, కాయలు చిన్నవిగా ఉంటాయి. బీరతో సమానమైన రూపము కలిగి ఉంటుంది.
గుత్తులుగుత్తులుగా కాస్తుంది. గుత్తునకు ఏడేసి కాయలు ఉంటాయి. తీపి, వగరు కలగలిసిన రుచితో ఉంటాయి.
గుత్తిబీర చలువచేసే స్వభావం కలిగి ఉంటుంది. కటువిపాకము కలిగినది. విషహరము. పైత్యహరము. జ్వరము, దగ్గు శమింపచేస్తుంది. బీరలలో ఇది పథ్యకరమైనది.