గంధమాంసి ని తెలుగులో కూడ గంధమాంసి అనే అంటారు. బజారులో దొరుకు గ్రంధ్యాణపు దినుసు. చేదుగా ఉంటుంది. విపాకమున కారపు రుచిగా మారుతుంది. జటామాంసిలో ఒక రకము. సువాసనగా ఉంటుంది. సంస్కృతంలో భూతజట, పిశాచిక, భూతకేశి, లోమశ, లఘుమాంసి, జటాల అని పిలుస్తారు.
గంధమాంసి తో ఔషధములు
తిక్తరసము, శీతవీర్యము కలిగిన గుణము కలిగి ఉంటుంది. కంఠరోగములు, రక్తపిత్తము, విషవికారములు, భూత జ్వరములు హరిస్తుంది.