లిప్స్టిక్ ప్లాంట్ : సింధూరపుష్పి అని సంస్కృతంలోను Bitaoimana. Crnott అనే శాస్త్రీయనామం కలిగిన జాబరా చెట్టు సుమారు మూడు గజముల ఎత్తు పెరుగుతుంది. దీనినే వాడుక భాషలో లిప్స్టిక్ మొక్క అని కూడా అంటారు. ఈ మొక్క ఆకులు ఇంచుమించు మారేడు ఆకులను పోలి ఉంటాయి. కాయలు పత్తికాయలవలె ఉండి పైన నూగు ఉంటుంది. కాయపండినచో పగులుతుంది. గింజలు సింధూరరంగు కలిగి దానిమ్మ గింజలను పోలి ఉంటాయి. ఈ గింజలను నీటిలో నానవేస్తే నీరంతా సింధూరరంగులో మారుతుంది. దీనితో బట్టలకు రంగు వేస్తారు. పువ్వు గుత్తులు గుత్తులుగా పూస్తుంది. పువ్వు కూడా ఎర్రగానే ఉంటుంది.

జాబరా చెట్టు గుణములు
బజరా చెట్టు చేదు, వగరు కలగలిసిన రుచితో ఉంటుంది. చలువచేస్తుంది. విపాకమున కారపు రుచిగా ఉంటుంది. శ్లేష్మవాతములను హరిస్తుంది. లఘుగుణము కలిగి ఉంటుంది. విషహరమైనది. వాంతిని కడుతుంది. దప్పిని తగ్గిస్తుంది. శిరో రోగములను హరిస్తుంది.
ఆధ్యాత్మికంగాకూడా ఈపుష్పాలు వినియోగిస్తారు. గ్రహబాధలను తగ్గించడానికి, కాళికాదేవిని పూజించడానికి విశేషంగా వినియోగిస్తారు.