తుమ్మి మొక్క విషజ్వరముకు మంచి మందు

 

ద్రోణ పుష్పి అని సంస్కృతంలోను, Leucas Linifolia, Aspera Leucas Caphalotes అనే శాస్త్రీయనామాలు కలిగిన తుమ్మి మొక్క అరగజము ఎత్తు వరకూ పెరుగుతుంది. ఈ తుమ్మి మొక్కను వాడుకభాషలో ఏనుగుతుమ్మి అని కూడా వ్యవహరిస్తారు. ఆకులు పసుపు, ఆకుపచ్చ రంగులు కలగలిసిన రంగులో ఉంటాయి. ఆకుకు ఒకవిధమైన సువాసన ఉంటుంది. ఆకులు రెండు అంగుళాల పొడవు, అంగుళము వెడల్పు ఉంటాయి. ఆకు కొంచెం గరుకుగా ఉంటుంది. దీనికి చిన్న బంతి వంటి కాయలు ఉంటాయి. ఆ కాయలోంచే పువ్వులు పూస్తాయి. పువ్వులు తెల్లగా ఉంటాయి. ఈ పువ్వు ఈశ్వర ప్రీతి కరమైనది. ఆకు కార్తీకమాసములో పులుసు కాచుకుని తింటారు. ఈ మొక్కలు ఖాళీ ప్రదేశాల్లో విస్తారంగా పెరుగుతాయి. 

తుమ్మి మొక్క గుణములు

తుమ్మి కారపు రుచి కలిగి ఉంటుంది. ఉష్ణవీర్యము కలిగినది. రూక్ష గుణము, వాతకఫములను హరిస్తుంది. అగ్నిమాంద్యమును పోగొడుతుంది. చాలా పథ్యకరమైనది. బుద్ధిని వికసింపచేస్తుంది. గ్రహబాధలను తగ్గిస్తుంది. విరేచనము సాఫీగా అయ్యేలా చేస్తుంది. కామాలారోగము, ఉబ్బులు, తమకశ్వాసము పోగొడుతుంది. ఆకు తీపి రుచి కలిగినది. పైత్యము చేస్తుంది. జ్వరమును తగ్గిస్తుంది. మూల వ్యాధిని హరిస్తుంది.  

తుమ్మి మొక్క ఔషధములు

విష జ్వరములకు

ఆకులరసము ఉదయము, సాయంత్రము సేవించినట్లయితే విష జ్వరములు తగ్గుతాయి. 

కామెర్లకు

ఆకు రసము కంటికి కాటుక పెట్టినట్టయితే కామెర్లు తగ్గుతాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.