కుటజ ప్రకాశ అని సంస్కృతంలో పిలువబడే గిరిమల్లికవృక్షజాతిలోనిది. ఆకులు కోలగాను, పెళుసుగాను ఉంటాయి. కాయలు అర్ధచంద్రాకారములో వంకరగా ఉంటాయి. సువాసన కలిగిన తెల్లని పువ్వులు పూస్తుంది.
గిరిమల్లిక గుణములు
వగరు, కారము కలిగిన రుచి ఉంటుంది. వేడి చేసే గుణము. విపాకమున కారపు రుచిగా మారుతుంది. లఘుగుణము కలది. కఫము, పిత్తములను హరిస్తుంది. వాతమును పెంచుతుంది. రక్తదోషములు, అతిసారము, క్రిములను పోగొడుతుంది. రుచిని పుట్టిస్తుంది.
గిరిమల్లి పువ్వులు చేదు, వగరు కలిగిన రుచితో ఉంటాయి. మిగిలిన గుణములు సమానమే. గిరిమల్లి చెట్టు గింజలు కూర వండుకుని తింటారు. ఆమవాత హరము, కఫహరము.