టేకుచెట్టుతో కుష్ఠురోగాలు సైతం మాయం_Teak Tree

ఖరపత్ర, శాకవృక్ష అనే పేర్లు కూడా కలిగిన టేకుచెట్టు మహావృక్షం. వంద అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. ఈ టేకుచెట్టు ఆకులు చేటలలా గుండ్రంగా ఉంటాయి. మ్రాను చేవకలిగి చిక్కనైన నునుపుగా ఉంటుంది. పువ్వులు తెల్లగా ఉంటాయి. ఆకు చేతిలో వేసి నలిపినట్లయితే చేయి ఎర్రబడుతుంది. మ్రాను ధ్వజస్తంభములకు ఉపయోగిస్తారు. గృహ నిర్మాణాలకు కూడా టేకు చాలా శ్రేష్ఠమైనది.  

టేకుచెట్టు గుణములు

టేకుచెక్క వగరు, తీపి కలగలిసిన రుచి, శీతవీర్యము, చలువ చేసే స్వభావము కలిగినది. విపాకమున తీపి రుచిగా మారుతుంది. త్రిదోషహారి. విశేషముగా వాత పైత్యములను శమింపచేస్తుంది. మూలవ్యాధికి మంచి మందు. అతిసారము, కుష్ఠువ్యాధిని హరింపచేస్తుంది.

టేకు ఆకు

టేకు చెట్టుకు పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి.   ఆకును భోజనం చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఈ టేకు ఆకులో భోజనం చేసినట్లయితే రుచికరముగా ఉంటుందని పెద్దలు చెబుతారు. ఇలా భోజనంచేయడం వల్ల ఆమము, పిత్తము, వాతము తగ్గిపోతుందని ఆయుర్వేద గ్రంథం వస్తుగుణ ప్రకాశికలో తెలుపబడింది. 

టేకు పువ్వు

ఈ టేకు పువ్వు చేదు, వగరు కలిసిన రుచితో ఉంటుంది. వాతము చేస్తుంది. కఫమును, ప్రమేహములను, పైత్యమును హరిస్తుంది. 

టేకు చెక్క విశేష గుణము

టేకు చెక్క విశేషముగా గర్భదోషములను హరించి, సంతాన ప్రాప్తిని కలిగించే దివ్య ఔషధం. 

టేకు కర్ర కోసిన రంపపు పొట్టుతో కషాయం చేసి వ్రణములను కడిగినట్లయితే కురుపులు త్వరితముగా మానుతాయి. ఆ కషాయమును పుక్కిలించినట్లయితే నోటిపూతలు కూడా తగ్గుతాయి. 

తామర, గజ్జికి

టేకు కర్ర నుండి తీసిన నూనెలో రసోత్తమాది చూర్ణము కలిపి పైన పూసినట్లయితే సమస్త చర్మవ్యాధులు హరిస్తాయని వస్తుగుణప్రకాశిక గ్రంథం తెలియచేస్తోంది.

కుష్ఠురోగములు హరిస్తాయి

టేకుచెక్క కషాయముతో స్నానము చేస్తూ, టేకు చెక్క గంథమును ఒంటికి పూసుకుంటూ కొంతకాలం పాటు చేస్తూ ఉంటే కుష్ఠరోగములు సైతం హరిస్తాయి. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.