సయాటికాకు మంచి మందు గుగ్గిలము (Balasamodendron Puboscens Resim)

గుగ్గులు, గంధరాజ, దేవధూప అనే పేర్లు కూడా కలిగిన గుగ్గిలము చెట్టు వృక్షజాతిలోనిది. పర్వత ప్రాంతములలో గాని, మరు భూములలో గాని పెరుగుతుంది. ఆకులు వేపాకులవలె ఉంటాయి. కాని చిన్నవిగా ఉంటాయి. గుగ్గిలం చెట్టుకు ఎర్రనిరంగు ఉన్న చిన్న చిన్న పువ్వులు ఉంటాయి. పువ్వులు అయిదేసి రేకులు కలిగి గుత్తులు గుత్తులుగా పూస్తాయి. కాయలు రేగుకాయలవలె ఉంటాయి. కాయల నుండి కూడ గుగ్గులు రసము తీస్తారు. ఈ రసము జిగురుగా ఉంటుంది. ఈ జిగురునకే గుగ్గిలము అని పేరు. ఈ గుగ్గిలము సువాసన కలిగి ఉంటుంది. ఈ గుగ్గిలములో రెండు మూడు రకాలు ఉంటాయి. 

రత్నపురి గుగ్గిలము, తెల్ల గుగ్గిలము, మహిషాక్షి గుగ్గిలము . మహిషాక్షికి ప్రత్యేక ఉపయోగములు ఉంటాయి. 

గుగ్గిలము గుణములు

కారము, చేదును కలగలిసిన రుచితో ఉంటుంది. వేడి చేస్తుంది. సువాసన కలిగి ఉంటుంది. బలమును కలిగిస్తుంది. వీర్యవృద్ధిని పెంపొదిస్తుంది. కఫ వాతములను హరిస్తుంది. విరేచనము చేయు గుణము కూడా కలిగినది. పొత్తికడుపులో ఉన్న దుర్గంధమును పోగొడుతుంది. క్రిములను హరిస్తుంది. దీపనకారి. చర్మరోగములను, వాపులను హరిస్తుంది. అతిసారములను కడుతుంది. స్తన్యమును వృద్ధినొందిస్తుంది. 

వాతమును పోగొడుతుంది

గుగ్గిలమును గో మూత్రముతో కలిపి నూరి పట్టువేసినట్లయితే స్తంభవాతము అరికట్టబడుతుంది. వాపులు కూడా తగ్గుతాయి.

చెవివాసన పోగొడుతుంది

గుగ్గిలపు పొగ చెవిలో పట్టించినట్లయితే చెవి దుర్వాసన తగ్గుతుంది. 

గృధ్రసీ వాతమునకు

సన్నరాష్ట్రము ఒకవంతు, గుగ్గిలము అందులో సగం వంతు కలిపి నేతితో నూరి కుంకుడుగింజలంత మాత్రలు చేసి ఉదయము, సాయంత్రము సేవించినట్లయితే గృధ్రసీ వాతము(సయాటికా) తగ్గుతుంది. 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.