పాలపండును సంస్కృతంలో రాజాదని అని పేరు. రాజ ఫలము, రాజ వల్లభము, క్షీరపృక్షము, నింబబీజము, గుచ్ఛ ఫలము, క్షీర శుక్లము అనే పర్యాయపదాలు కూడా ఉన్నాయి.
పాలపండు గుణములు
- పాలపండు మధురము, గురుత్వము. పిత్తమును హరిస్తుంది.
- వీర్యవృద్ధి, తృప్తి, శరీరమునకు శక్తి కలిగిస్తుంది.
- మేహ వ్యాధులు, దప్పిక, మూర్ఛ, మత్తు, శ్రమ, క్షయ, రక్తదోషములు పోగొడుతుంది.
- పాలపండు పట్ట కషాయము అతిసారము, జ్వరములను తగ్గిస్తుంది.
- దంతవ్యాధులు, పంటి చిగుళ్ళ బాధలు పోగొడుతుంది.
- స్త్రీల వంధ్యత్వము పోగొడుతుందని వస్తుగుణ ప్రకాశిక గ్రంథం వివరిస్తోంది.