అన్ని జంతువుల నెయ్యి కంటే ఆవునెయ్యి ఎంతో శ్రేష్ఠమైనది. ఆరోగ్యానికి అమృతం వంటిది. ఆవునెయ్యి తీపి, వగరు కలగలిసిన రుచితో ఉంటుంది. బుద్ధిని వికసింపచేసే గుణము కలిగి ఉంటుంది. జ్ఞాపకశక్తిని వృద్ధి పరుస్తుంది. శరీరమునకు, ఇంద్రియములకు కూాడా మంచి పుష్ఠిని, బలమును కలిగిస్తుంది.
ఆవునెయ్యి త్రిదోషహారి
త్రిదోషములను హరిస్తుంది. మనస్సుకు, శరీరమునకు స్థైర్యమును కలిగిస్తుంది. నేత్రములకు ఎంతోమంచిది. ఎంతటి వ్రణములు(కురుపులు) అయినా మాన్పుతుంది. ఆవునెయ్యి తలకు, పాదములకు మర్దనా చేసినట్లయితే వాతపైత్యపు మంటల తగ్గిస్తుంది. భోజనములో నిత్యం ఉపయోగించినట్లయితే ఆహారములోని పోషకాలను వృద్ధి పొందించి పదార్ధములను చక్కగా జీర్ణము చేసి శరీరానికి మంచి బలాన్నిస్తుంది. ఆవునెయ్యిని కుండలో వేసి వాసిన కట్టి దానిని భూమిలో పాతిపెట్టి ఆ నెయ్యిని వ్రణములపై మర్దనా చేస్తే అవలీలగా తగ్గుతాయి. ఎంతకాలం నిలువ చేస్తే అంత శ్రేష్ఠము. ఆవునేతితో చేసిన పిండివంటలు కూాడా చాలా పోషకాలుకలిగి ఉంటాయి.